Genesis 6
1మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు 2దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకొన్నారు. 3యెహోవా, <<నా ఆత్మ మనుషులలో ఎల్లకాలం ఉండదు, ఎందుకంటే వారు కేవలం రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతారు>> అన్నాడు. 4ఆ రోజుల్లో నెఫీలులు అనేవారు భూమి మీద ఉండేవాళ్ళు. ఆ తరువాత కూడా వాళ్ళు ఉన్నారు. దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. పూర్వకాలంలో పేరు పొందిన శూరులు వీరే. 5మనుషుల చెడుతనం భూమిమీద అధికంగా ఉందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూసి, 6తాను భూమిమీద మనుషుల్ని చేసినందుకు బాధపడి, ఆయన తన హృదయంలో విచారించాడు. 7కాబట్టి యెహోవా, <<నేను సృష్టించిన మనుషుల్ని ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువుల్ని, పాకే జీవుల్ని, ఆకాశపక్షుల్ని భూమిమీద లేకుండా తుడిచివేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను>> అన్నాడు. 8అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. 9నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరంవాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. 10షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు. 11దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. 12దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. 13దేవుడు నోవహుతో, <<మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను. 14కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా కీలు పూయాలి. 15నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి. 16ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దానిని చెయ్యాలి. 17విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి. 18కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు. 19నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి. 20నువ్వు వాటిని సజీవంగా ఉంచడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరకు అవే వస్తాయి. 21తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి>> అని చెప్పాడు. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అంతా చేశాడు. 22
Copyright information for
TelULB